బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు
మంచిర్యాల,డిసెంబర్ 15(కలం శ్రీ న్యూస్): మంచిర్యాల జిల్లా ముల్కల మండలం నేలమాలిగలో అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు పోటెత్తారు. అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రజలు క్యూ లైన్ పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఒకానొక సమయంలో ప్రజలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం పూజారీతో పాటు పలువురు పీఠాధిపతులు స్వామీజీలు గోదావరి పరిక్రమ యాత్ర చేపట్టారు. డిసెంబర్ 12వ తేదీన ఈ యాత్ర మంచిర్యాల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ముల్కల మండలం నేలమాళిగలో గోదావరి నది పుష్కరఘాట్ కు వెళ్లే మార్గంలో ఒక ప్రదేశాన్ని చూపించి ఈ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి ఉందని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.
స్థల యజమాని అనుమతితో స్థానికులు ఆ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహం పై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయటపడింది. దీంతో అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో అమ్మ వారి విగ్రహం బయటపడడం తమ అదృష్టమని గ్రామస్తులు ఈ సందర్భంగా వెల్లడించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

