Breaking News
Sunday, January 18, 2026
Breaking News

లోక్ అదాలత్ లతో సమ న్యాయం:జడ్జి దుర్గం గణేశ్

లోక్ అదాలత్ లతో సమ న్యాయం :జడ్జి దుర్గం గణేశ్

సుల్తానాబాద్, డిసెంబర్ 21:(కలం శ్రీ న్యూస్): 

లోక్ అదాలత్ లతో ఇరు వర్గాలకు సమ న్యాయం అందుతుందని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లలో ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పలు క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి దాదాపు 300 కేసులు పరిష్కరించారని కోర్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య,, ఏజీపీ దూడం ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, న్యాయవాదులు గూడెపు దివాకర్ రావు, ఆవుల లక్ష్మీరాజం, పడాల శ్రీరాములు, వొడ్నాల రవీందర్, జోగుల రమేష్ , ఆవుల శివకృష్ణ, సామల రాజేంద్ర ప్రసాద్, రుద్రారపు నర్సయ్య, వేముల స్నేహ, మాడూరి పృథ్వీ, రాహుల్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!