Breaking News
Sunday, January 18, 2026
Breaking News

జోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా

జోరుగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా

24×7 లెక్కన జరుగుతున్న దందా.

వైన్ షాపుల అనుబంధంగా నడుస్తున్న దందా

మామూళ్ల మత్తులో సంబంధిత శాఖ అధికారులు!

సుల్తానాబాద్ అక్టోబర్ 06(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ పట్టణంలో అలాగే జోరుగా బెల్ట్ షాపుల దందా సాగుతోంది. పట్టణ కేంద్రంలో పూసాల, గట్టేపల్లి రోడ్, సుగ్లాంపల్లి,పోచమ్మ టెంపుల్,ఇలా దాదాపు అన్ని ఏరియాలో అనుమతులు లేని ఈ బెల్టు షాపు లను కొందరు వ్యాపారులు యదేచ్ఛగా నడుపుతున్నారు. ఎలాంటి అనుమతులు, ఎక్సైజ్ శాఖ నిబంధనలు లేకుండా బెల్ట్ షాపులు మండలంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పట్టణంలో పట్టపగలే జరుగుతున్న ఈ దందాకు కళ్లెం వేసే నాధుడే కరువయ్యాడు. మందు తాగడానికి సరైైైైన స్థలం లేక, బహిరంగ ప్రదేశాలలో మందు తాగితే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారనేే భయంతో ఇలా బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నట్లు కొందరు మద్యం ప్రియులు అంటున్నారు. అదీకాక బెల్ట్ షాపుల్లో రోజులో పగలు, రాత్రి అనే తేేడా లేకుండా, ఎప్పుడైైనా మద్యం తాగడానికి అనువుగా ఉంటుందని, ఇక్కడ తినడానికి స్టఫ్, సిగరెట్టు, గుట్కా కూడా లభిస్తుందని మందుబాబులు అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని బెల్టు షాపు నిర్వాహకులు తెలివిగా క్వార్టర్ బ్రాందీ, బీరు సీసా కు 20 నుండి 30 రూపాయల ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఆయా గ్రామాల్లో వివిధ కాలనీల్లో కుటుంబ నివాసాల మధ్య ఈ బెల్టు షాపులు ఉండడంవల్ల పగలు, రాత్రి అనేే తేడా లేకుండా మద్యం లభించడంతో, మద్యం సేవించిన వారి చర్యల వలన చుట్టుపక్కల ప్రజలు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి బెల్టుషాపులను మూసివేయాలని పలువురు కోరుతున్నారు.

 

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!