ప్రజలతో మమేకమవుతూ సమస్యలను తెలుసుకుంటున్న వార్డ్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మి
సుల్తానాబాద్, ఏప్రిల్ 30 (కలం శ్రీ న్యూస్) : మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డులో సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మి అన్నారు. ఆదివారం మున్సిపాలిటి 9 వ వార్డు లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు, వార్డులోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ, సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారం చేసేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ లతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు పాటుపడతామని అన్నారు. అలాగే కాలనీలో అవసరమైన డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణంతో పాటు వీధి లైట్లు, మున్సిపల్ నల్ల నీరు, తదితర సమస్యలు ఏమున్న వాటిని పరిష్కరించేందుకు వారి దృష్టికి తీసుకువెళ్లి, త్వరలోనే పనిని చేసేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రతిరోజూ ఉదయం 7:00గంటలకు మీతో మేము అనే కార్యక్రమం ద్వారా 9వ,వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య , సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ , గొట్టం మహేష్ ,స్వప్న , అంజయ్య , అమృత , ఆశ వర్కర్లు , సిఎ లు ,అంగన్ వాడిలు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..