Breaking News
Sunday, January 18, 2026
Breaking News

రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణలను తొలగించాలి

రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణలను తొలగించాలి

సుల్తానాబాద్,నవంబర్ 10( కలం శ్రీ న్యూస్): రాజీవ్ రహదారి కి ఇరువైపుల వ్యాపారులు ఆక్రమణలను తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా 50 ఫీట్ల వరకు వ్యాపారులు ఆక్రమణలను తొలగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్, పోలీస్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తో పాటు హెచ్.కె.ఆర్ అధికారులు రాజీవ్ రహదారి పై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. వెంటనే వ్యాపారులు తమ షాప్ ముందు 50 ఫీట్ల లోపు వేసుకున్న రేకులను, షెడ్లను తొలగించాలన్నారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడంతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వ్యాపారులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అనిల్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఆర్ అండ్ బి ఈ.ఈ బావురావు, ఏఈ గుణశేఖర్, హెచ్.కె.ఆర్ అధికారి రామకృష్ణ తో పాటు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!