ఒక్కసారి గెలిపిస్తే… ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా..
మడక, డిసెంబర్ 14(కలం శ్రీ న్యూస్):
నన్ను ఒక్కసారి ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామ సేవ చేస్తానని మడక గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోషిక కమల్ గ్రామ ప్రజలను కోరుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓదెల మండలం మడక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గోశిక కమల్ గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సంఘం కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తానని హామీ ఇస్తున్నాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు సాగుతామని అంటున్నాడు.

వాడ వాడలా, ఇంటింటికి తిరుగుతూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతుండడంతో గోషిక కమల్ కు వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు, ప్రజలు కూడా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఎల్లవేళలా గ్రామంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని, ఈనెల 17న జరిగే ఎన్నికల్లో బ్యాటు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాడు. ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో సర్పంచ్ గా తన గెలుపు ఖాయమని గోశిక కమల్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

