ఏబీవీపీ స్టూడెంట్ ఫర్ సేవా రాష్ట్ర కన్వీనర్ గా సందనవేణి ఓమేష్ నియామకం
ఎలిగేడు,జనవరి6(కలం శ్రీ న్యూస్): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)స్టూడెంట్ ఫర్ సేవా రాష్ట్ర కన్వీనర్ గా సందనవేణి ఓమేష్ ఎన్నికయ్యారు. శంషాబాద్ లో 3,4,5, తేదీల్లో ఘనంగా నిర్వహించిన 44వ రాష్ట్ర మహాసభల్లో ఈ నియామకం జరిగింది. రాష్ట్ర మహాసభలలో రావుల కృష్ణ రాష్ట్ర అధ్యక్షులుగా, మాచర్ల రాంబాబు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికైన అనంతరం, నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన సందనవేణి ఓమేష్ ని రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ స్టూడెంట్ ఫర్ సేవా రాష్ట్ర కన్వీనర్ గా ప్రకటించడం జరిగింది.గతంలో నిర్వహించిన బాధ్యతలు కళాశాల కార్యదర్శిగా పెద్దపల్లి నగర,సంయుక్త కార్యదర్శి జోనల్ ఇన్చార్జిగా ఎలిగేడు మండల సంపర్క కేంద్ర కన్వీనర్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ గా జిల్లా ఎస్.ఎఫ్.ఎస్ కన్వీనర్ గా ఎస్.ఎఫ్.ఎస్ రాష్ట్ర కోకన్వీనర్ గా సందనవేణి ఓమేష్ బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సందనవేణి ఓమేష్ మాట్లాడుతూ స్టూడెంట్ ఫర్ సేవా రాష్ట్ర కన్వీనర్ గా తన నియామకానికి సహకరించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు, కరీంనగర్ విభాగ్ పెద్దలకు, ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థుల్లో జాతీయ భావజాల విస్తరణకు తన సమయాన్ని కేటాయించి విద్యార్థులను జాతీయ వాదులుగా తీర్చిదిద్దుతానని అన్నారు. సందనవేణి ఓమేష్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తమవుతుండగా, పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖులు, పెద్దలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

