అయ్యప్ప గుడిలో పురోహితుడి జన్మదిన వేడుకలు.
సుల్తానాబాద్, జనవరి 6(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల సమక్షంలో పురోహితు ని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజున సుల్తానాబాద్ స్థానిక నీరుకుల్ల రోడ్డులో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ పూజారి రవీంద్ర చారి శిష్యుడైన అజయ్ చారి జన్మదిన సందర్భంగా అయ్యప్ప మాలదారులు కేక్ కట్ చేసి వేడుకను నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా గుడికి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరి పేరు మీద అర్చనలు, చేసి వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని పూజలు చేసి, దీవించే పూజారి యొక్క జన్మదిన వేడుకలను టికే.తిరుపతి గురు స్వామి ఆధ్వర్యంలో,అయ్యప్ప భక్త బృందం గుడి లో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజారికి భక్తబృందం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పూజారి మాట్లాడుతూ నా పుట్టినరోజును హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టికే తిరుపతి గెల్లు మనోహర్, కొయ్యడ చిరంజీవి, కొయ్యడ వీరాస్వామి,ఓదెల యాదగిరి,బోదాసు సదయ్య,నూక రామదాసు,దాసరి వెంకటేష్, భూసారపు సురేష్, తన్నీరు సాయి కుమార్, గెల్లు మధుకర్, గెల్లు సంతోష్,మలయాళ పరుశురాం, కొయ్యడ వేణుగోపాల్, దాసరి విజయ్ కుమార్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

