రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన లక్ష్మీ అన్విత
సుల్తానాబాద్,జనవరి5(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ అన్విత కరీంనగర్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో చక్కటి ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి దాదాపు 900 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా సుల్తానాబాద్ మండలంలోని కందునూరు పల్లి అనుబంద గ్రామమైన హనుమండ్ల పల్లి గ్రామానికి ఏడవ వార్డు సభ్యులు బోయిని విజయ – వినోద్ ల కూతురు లక్ష్మీ అన్విత టోర్నమెంట్ ఆర్గనైజర్ సురభి వేణుగోపాల్ నిర్వహించి ఛాంపియన్షిప్ పోటీలలో అండర్ 12 ఇయర్స్ విభాగంలో చక్కటి ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడంతో గ్రామ సర్పంచ్ చొప్పరి శైలజ – అంజన్న, పాఠశాల ప్రిన్సిపల్ గోల్డి బల్బీర్ కౌర్, వైస్ ప్రిన్సిపాల్ కొండయ్య, కరాటే ఉపాధ్యాయురాలు శ్యామల, వ్యాయామ ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మి లతోపాటు పలువురు విద్యార్థిని లక్ష్మీ అన్వితను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో క్రీడల్లో రాణించి తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

