గ్రామ అభివృద్ధియే ప్రధాన లక్ష్యం.
దూళికట్ట సర్పంచ్ మారం కొమురయ్య
ఎలిగేడు, డిసెంబర్ 31(కలం శ్రీ న్యూస్): ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో బుధవారం రోజున గ్రామ సర్పంచ్ మారం కొమురయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్య, నీటి సమస్య, కరెంటు స్ట్రీట్ లైట్ కు సంబంధించిన సమస్యలు,సిసి రోడ్లను అధికారుల సమన్వయంతో పరిష్కరించి,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి అందేలా చూస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారం కొమురయ్య, ఉప సర్పంచ్ మేచినేని అండాలు- సత్యనారాయణరావు, గ్రామ కార్యదర్శి పున్నమయ్య, వార్డు సభ్యులు, అన్ని శాఖల అధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

