రైతులు నట్టల నివారణ మందులు పంపిణీ ని సద్వినియోగం చేసుకోండి.
పశువైద్యాధికారిని ఝాన్సీ
ఎలిగేడు, డిసెంబర్ 23(కలం శ్రీ న్యూస్):
రైతులు నట్టల నివారణ మందులు పంపిణీ ని సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారిని ఝాన్సీ కోరారు.పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దులికట్ట గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మారం కొమురయ్య ఆధ్వర్యంలో 1120 గొర్లు, మేకలకు నట్టల నివారణ మందులు తాగిపించడం జరిగింది.
ఈ సందర్భంగా పశు వైద్యాధికారిని ఝాన్సీ మాట్లాడుతూ ఈరోజు నుండి మొదలు 31 తేదీ వరకు అన్ని గ్రామాలలో నట్టల నివారణ మందులు జీవాలకు వేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని రైతుల ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారం కొమురయ్య, వార్డు సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కొండ ఓదెలు, గోపాలమిత్ర సమ్మయ్య, కొత్త మల్లయ్య, ఎల్లయ్య, కనకయ్య, గొల్ల, కురుమలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

