సెంట్రల్ లైటింగ్స్… ఐస్ లాండ్స్ తో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాం
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, డిసెంబర్23(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి తహసిల్దార్ కార్యాలయం మీదుగా గట్టేపల్లి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు సెంటర్ లైటింగ్, రెండు చోట్ల ఐలాండ్స్ నిర్మాణం చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులు వెచ్చించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మాణం చేపడుతున్న రోడ్డును స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ రెండు చోట్ల అంబేద్కర్ కూడలి, ఎంపీడీవో కార్యాలయ కూడలి ల వద్ద 50 లక్షలతో ఐలాండ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా తారు రోడ్డు నిర్మాణం చేపట్టి, దశలవారీగా డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేపడుతామని, అనంతరం ఐలాండ్స్ ఏర్పాటు చేపడతామని తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ మండలం పై సవతి తల్లి ప్రేమను చూపారని, ఇక్కడ అభివృద్ధిని విస్మరించి గతంలో పాత తాలూకా గా ఉన్న ఈ ప్రాంతంలోని కార్యాలయాలను సైతం తరలించుకు పోయారని, పోస్టుమార్టం తో పాటు అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి ఈ ప్రాంతంలో పాత తాలూకా గా గుర్తించి 1989- 90 లో రెండు ఎకరాల స్థలం కేటాయించి ఐసిడిఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, దానిని కూడా తరలించుకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఐబి కార్యాలయంలో ఆర్ అండ్ బి లో డి ఈ ఆఫీస్ విద్యార్థుల డిస్టెన్స్ సర్టిఫికెట్ కోసం ఏర్పాటు చేస్తే దానిని తరలించారని అన్నారు. ఇలా మండలంలో అనుకూలంగా ఉన్న అన్ని కార్యాలయాలను తరలించాలని పేర్కొన్నారు. ఐబి, ఇరిగేషన్, త్రాగునీటి ఆర్.డబ్యు,ఎస్ సెక్షన్ కార్యాలయం నిర్వీర్యం చేశారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న గీట్ల ముకుంద రెడ్డి, బిరుదు రాజమల్లు ఈ ప్రాంతంపై అమితమైన ప్రేమను చూపి కార్యాలయాలను తీసుకువచ్చి ఏర్పాటు చేస్తే దాసరి మనోహర్ రెడ్డి వాటిని తరలించుకుపోయారని అన్నారు.

రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దామని గతంలో పాత జెండా చౌరస్తా నుండి సిసి రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని మిగిలి ఉన్న పోలీస్ స్టేషన్ ఏరియా గజ బీన్ కార్ జగన్, హజారుద్దీన్ హాస్పిటల్ ఏరియా వడ్డెర కాలని, మేరవాడ, తదితర కాలనీలలో రోడ్లను పూర్తి చేపడతామని, అలాగే పాత రహదారి సుద్దాల, రేగడి మద్దికుంట, మియాపూర్, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డున సైతం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దాదాపు సంవత్సరం కాలంలో ఈ రోడ్లన్నీ పూర్తిచేస్తే సుల్తానాబాద్ 90% అభివృద్ధి పూర్తయితుందని పేర్కొన్నారు. అలాగే 14 నుండి 15 కోట్ల రూపాయలతో అమృత 2.0 లో పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి పైప్ లైన్ పనులు చేస్తున్నామని, త్వరలోనే త్రాగునీటి సమస్యను సైతం పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ రోడ్లను తలపించే విధంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలో రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని, నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం చేపట్టి సుల్తానాబాద్ ను అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, బిరుదు కృష్ణ, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, వస్తే ఏం గణేష్, మహమ్మద్ రఫీక్, దున్నపోతుల రాజయ్య, గాదాసు రవీందర్, ప్రభాకర్, ఫరూక్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

