శబరిమల కానుకలు స్థానిక ఆలయ హుండీలోకి
సుల్తానాబాద్,జనవరి13(కలం శ్రీ న్యూస్):
41 రోజుల మండల కాల దీక్ష అనంతరం అయ్యప్ప స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇరుముడి సందర్భంగా కుటుంబ సభ్యులు, భక్తులు తమ కోరికలు తీరాలని అందులో వేసిన నగదు, కానుకలను తిరిగి స్థానిక దేవాలయ అభివృద్ధికి వినియోగించాలని గురుస్వాములు తెలిపారు.
గత కొంతకాలంగా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వాములకు సరైన వసతులు కల్పించలేక స్వాములను, భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, అందువలన భక్తులు ఇరుముడిలో వేసిన కానుకలను అక్కడ మొక్కు చెల్లించి తిరిగి స్థానిక ఆలయాలలోని హుండీలో వేసి ఆలయల అభివృద్ధికి దోహదపడాలని గురుస్వాములు సూచించారు.
ఈ సందర్భంగా ఇటీవల మాటేటి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర ముగించుకొన్న భక్త బృందం అక్కడ మొక్కులు చెల్లించిన కానుకలను స్థానిక శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వహణ కమిటీ సమక్షంలో హుండీలో వేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ సాయిరి మహేందర్ గురుస్వామి, గురు స్వాములు మిట్టపల్లి మురళీధర్, మెరుగు వెంకటేష్, వుస్తెం రవీందర్, గందె రాజు, గుండ మురళి, చందు, నవీన్, రాజయ్య స్వామి, ఆలయ పూజారి గూడ సాయినాథ్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

