ఎట్టి పరిస్థితిలో చైనా మాంజా విక్రయించవద్దు
సిఐ సుబ్బారెడ్డి , ఎస్సై చంద్రకుమార్
చైనా మాంజా విక్రయాల పై పోలీసుల విస్తృత తనిఖీలు
సుల్తానాబాద్, జనవరి 10 (కలం శ్రీ న్యూస్):
చైనా మాంజాను విక్రయిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ హెచ్చరించారు. శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో వివిధ దుకాణాలలో చైనా మంజుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అతి ప్రమాదకరమైన చైనా మాంజా ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గాలిపటాలు ఎగుర వేసే సమయంలో పలువురి మాంజా ద్వారా చేతులు తెగుతాయని, అలాగే గాలిపటాలను ఎగురవేసే సందర్భంలో తాడు తెగి పడిపోయి రోడ్లపై ఉండడంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు,బాటసారులకు వివిధ సందర్భాలలో తగిలి తీవ్ర గాయాలపాలైన వారు ఉన్నారని, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు సైతం ఉన్నారని, ఎట్టి పరిస్థితిలో చైనా మాంజాను విక్రయించవద్దని, విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలెవరు చైనా మాంజాను వాడవద్దని, సాధారణ గాలిపటాలను మాత్రమే ఎగరవేయాలని సూచించారు. ప్రజలందరూ గమనించి సహకరించాలని, ఒకరి ఆనందం మరొకరికి విషాదం కలిగించకుండా ఉండాలని, ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు వివరించారు.ఈ తనిఖీలలో ఎస్సై చంద్రకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

