కేజీవీల్స్ తో రోడ్డు పై నడుస్తున్న ట్రాక్టర్ పట్టివేత
సుల్తానాబాద్,జనవరి 7(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో కేజీవీల్స్ తో రోడ్డుపై నడుస్తున్న ట్రాక్టర్‌ను ఎస్సై చంద్రకుమార్ పట్టుకున్నారు. అట్టి ట్రాక్టర్ సుద్దాల గ్రామానికి చెందిన ఒజ్జ హరీష్ దిగా గుర్తించారు. ఈ విధంగా రోడ్లపై కేజీవీల్స్ తో ట్రాక్టర్ లు నడపడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయని,దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కావున ఎవరూ కూడా కేజీవీల్స్ తో రోడ్ల పైకి రాకూడదని, ఒకవేళ వచ్చినట్లయితే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని ఎస్సై చంద్రకుమార్ హెచ్చరించారు.ఇట్టి విషయంలో రైతులు, ట్రాక్టర్ యజమానులు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.ఇట్టి ట్రాక్టర్ ను తదుపరి చర్యల కోసం సుల్తానాబాద్ తహసిల్దార్ భషిరోద్దీన్ అప్పగించగా ట్రాక్టర్ యాజమానికి 5000 జరిమాన విధించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

