రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత
సుల్తానాబాద్,జనవరి5(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలంలో ఆదివారం రోజున రాత్రి సమయంలో ఎస్సై చంద్రకుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కదంబపూర్ మానేరు నుంచి కరీంనగర్ కి అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి మహేంద్ర బొలెరో వాహనాన్ని గర్రెపల్లి గ్రామంలో పట్టుకోవడం జరిగింది. అనంతరం కదంబపూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని సయ్యద్ వలి, డ్రైవర్ షేక్ బషీర్ లపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించినట్లయితే ఉపేక్షించేది లేదని ఎస్సై చంద్ర కుమార్ హెచ్చరించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

