అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత
సుల్తానాబాద్,జనవరి04(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం సమయంలో ఎస్సై చంద్ర కుమార్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్నటువంటి రెండు టిప్పర్లను సుల్తానాబాద్ పట్టణంలో ఎస్సై చంద్రకుమార్ పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇట్టి దానిపై పూర్తి విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటామని, అదే విధంగా ఎవరైనా అక్రమంగా మట్టి గాని, ఇసుక గాని తరలించినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

