Breaking News
Friday, January 16, 2026
Breaking News

ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు

ఘనంగా భారతరత్న మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు

సుల్తానాబాద్, డిసెంబర్25(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి ఆధ్వర్యములో బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాజ్ పాయ్ చిత్ర పటానికి పూల మాలవేసి స్వీట్స్ పంపిణీ చేసి 101వ జయంతి వేడుకలు కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి  పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… భరతమాత గర్వించే ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్ పాయ్ జీవితాంతం దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం, అభివృద్ధి కోసం కృషి చేశారని, దేశంలో కనెక్టివిటీ పెరగడానికి హై వేల నిర్మాణం చేపట్టిన మహనీయుడు. ట్రైబల్ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తపన పడిన గొప్ప నాయకుడు, అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా దేశ సౌభాగ్యమే లక్ష్యంగా పని చేశారు. భారత ప్రజా స్వామ్య రూపు రేఖలను తన మాటలతో, అత్యున్నత నడవడికతో తీర్చి దిద్దిన మహోన్నత రాజ నీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని వివరించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లేది సంవాదంతోనే కానీ వివాదంతో కాదని, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ దేశం మాత్రం శాశ్వతంగా నిలిచి ఉండాలని ఆయన బలంగా నమ్మారని, రాజకీయం అంటే అధికారం కోసం చేసే పరుగు పందెం కాదు, అదొక సేవా యజ్ఞం అని గుర్తు చేశారు 1999లో భారత దేశ అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం చేసిన దూరదృష్టి గల నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. దేశ ఆర్థిక ప్రగతికి రహదారులే జీవనాడులని ఆయన బలంగా విశ్వసించారు. ఆ దృఢ సంకల్పం నుంచే పురుడు పోసుకుంది స్వర్ణ చతుర్భుజి ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్‌కత్త లను అను సంధానించే ఈ హై-స్పీడ్ హైవే నెట్‌ వర్క్ కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత మౌలిక వసతుల చరిత్రలో ఇదొక విప్లవం అని గుర్తు చేశార. స్వర్ణ చతుర్భుజితో మొదలైన ఈ ప్రస్థానం నేడు 1.45 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు 25కు పైగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలతో కొత్త శిఖరాలకు చేరింది అని వివరించారు. వాజ్‌పేయి  నాడు చూపిన బాట నేడు నరేంద్ర మోదీ పాలనలో జాతీయ ప్రాధాన్యతగా మారి మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ రహదారి వ్యవస్థే దానికి నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. రాజకీయాల్లో ఆయన పాటించిన హుందాతనం, అందరినీ కలుపుకు పోయే తత్వం దేశమే ప్రథమముఅనే ఆయన సిద్ధాంతం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది అని తెలియచేశారు.

ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్. కార్యదర్శి వేగోలపు శ్రీనివాస్ గౌడ్, సామాజిక నాయకులు ఎగోలపు సదయ్య గౌడ్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాటూరి లత, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజభింకర్ పవన్, ఎనగందుల సతీష్, ఎలవేని తిరుపతి, భూసారపు సంపత్, ప్రధాన కార్యదర్శి కందునూరి కుమార్, బుర్ర సతీష్ గౌడ్, ఓ బి సి మోర్చా అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్, ఎల్లంకి రాజు, వల్స సాయికిరణ్, రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!