ఏసు ప్రభువు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయి
ప్రార్థన మందిరాలకు రూ.30 వేల చొప్పున.. రూ.33 కోట్లు కేటాయింపు.
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
పెద్దపల్లి, డిసెంబర్ 25(కలం శ్రీ న్యూస్):
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ప్రగతినగర్ ఇండియా మిషన్ స్కూల్ వద్ద గల భేతేల్ ప్రార్థన మందిరం, శాంతినగర్ కెనాల్ కాలువ వద్ద గల న్యూ బిలివర్ ప్రార్థన మందిరం, కవునేంట్ ప్రార్థన మందిరం, అమర్ నగర్ లోని కలవేరి ప్రార్థన మందిరం, పట్టణంలోని మొగల్ పూర ప్రాంతంలోని సి.ఎస్.ఐ ప్రార్థన మందిరాలలో, సుల్తానాబాద్ పట్టణంలోని భేతేల్ గ్లోబల్ చర్చిలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్,ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ప్రతి వ్యక్తి సన్మార్గంలో భక్తి భావనతో ప్రార్థనలు చేయాలని సూచించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ప్రత్యేకం వాటిని ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా ఆచరించాలని సూచించారు. పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ సందేశమని తెలిపారు. ఈ పండుగను క్రైస్తవులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7,000 చర్చిలకు పండుగ ఖర్చుల నిమిత్తం మొత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగిందని అని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సోదర సోదరీమణులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

