క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను బోధిస్తుంది
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
పెద్దపల్లి, డిసెంబర్ 24 (కలం శ్రీ న్యూస్):
క్రిస్టమస్ పండుగ సందర్భముగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణుల క్రిస్మస్ విందు కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

అనంతరం ఎమ్మెల్యే విజయ రమణ రావు కి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రార్ధన చేసి ఆశీర్వాదం అందించిన క్రైస్తవ మత పెద్దలు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను బోధిస్తుందని అన్నారు. మత సామరస్యం, ఐక్యతతో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవడం మన రాష్ట్ర ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే రోజు జరుపుకునే పండుగ క్రిస్టమస్ పండుగ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో గంగయ్య, పలు మండలాల తహసీల్దార్లు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, క్రిస్టియన్ మత పెద్దలు, క్రైస్తవ సోదర సోదరీమణులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చర్చ్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

