జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతటి అన్నయ్య కు పితృ వియోగం
సుల్తానాబాద్, డిసెంబర్ 16(కలం శ్రీ న్యూస్):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ కురువృద్ధ నేత గుండెపోటుతో మృతి. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. అంతటి రాయలింగు గౌడ్ దివంగత మాజీ సర్పంచ్ గరిగే మధురయ్య సర్పంచ్ గా ఉన్న సమయంలో ఉప సర్పంచ్ గా 11 సంవత్సరాలు పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్నోసార్లు వార్డు సభ్యులుగా పనిచేసి ప్రజలకు సేవ చేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాయలింగు గౌడు ఇక లేరన్న వార్తతో సుల్తానాబాద్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాంగ్రెస్ వాదిగా అంతటి రాయలింగు ప్రస్థానం తో సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు. అంతటి రాయలింగు గౌడ్ మరణం దిగ్బ్రాంతిని చేకూర్చింది.విషయం తెలుసుకున్న వెంటనే రాజకీయ నాయకులు, వ్యాపారులు,వివిధ పార్టీ నేతలు ఆయన పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

