పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్, విజయ్ కుమార్.
కోశాధికారిగా విద్యాసాగర్ రావు.
పెద్దపల్లి, డిసెంబర్8(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవరాగాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ లో సభ్యులు పూర్తి ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు సీనియర్ జర్నలిస్టు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు చింతకింది చంద్రమొగిలి, ముఖ్య అతిథి వడ్డేపల్లి రవీందర్ సమక్షంలో క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా ముస్త్యాల రవి కిషోర్, బుర్ర సంపత్ కుమార్, చింతకింది చంద్రమొగిలి, వడ్డేపల్లి రవీందర్, అధ్యక్షులుగా నారయణదాస్ అశోక్, ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్, కోశాధికారి వీరమల్ల విద్యాసాగర్ రావు, ఉపాధ్యక్షులుగా ఆకుల రమేష్, కొండ లింగమూర్తి యాదవ్, ఈదునూరి జయపాల్, సహాయ కార్యదర్శులుగా నాగులమల్యాల శివ కోటయ్యచారి, కొమిరిశెట్టి శ్రీనివాస్, మోదుంపల్లి సాగర్, కార్యవర్గ సభ్యులుగా అడిచెర్ల రమేష్, ముత్యాల కృష్ణమూర్తి, కొలిపాక కృష్ణ, తిరుమల సురేష్, సయ్యద్ నసీర్, సుంక మహేష్ ఏకగ్రవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు నారాయణదాసు అశోక్, పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ క్లబ్ లోని సభ్యులందరి సహాయ సహకారాలతో కార్యకలాపాలను నిర్వహిస్తూ, క్లబ్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా వంటి హక్కుల సాధన కోసం క్లబ్ తరపున పోరాటంలో ముందుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై రెండు మూడు రోజుల్లోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

