Breaking News
Friday, January 16, 2026
Breaking News

ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా సుల్తానాబాద్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో.

ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా సుల్తానాబాద్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో.

సుల్తానాబాద్,నవంబర్02(కలం శ్రీ న్యూస్):

రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడిచిన అభివృద్ధిని మరిచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని అగ్ర భాగాన నిలిపిన బిజెపి నేతలపై అనుచిత వాక్యాలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శమని బిజెపి పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఆదివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక పూసల చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వైఫల్యం చెంది అనతి కాలంలోనే ప్రజల మన్నలను కోల్పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చూడలేదని ఆరోపించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన బిజెపి ప్రభుత్వంపై ,మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల పై, అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటని, తక్షణమే ముఖ్యమంత్రి మంత్రులు రేవంత్ రెడ్డి తన మాటలను వెనక్కు తీసుకొని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తున్న బిజెపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రంలో ప్రధాని వద్దకు వెళ్లి నిధుల కోసం మోకరిల్లుతూ రాష్ట్రానికి వచ్చి బిజెపిని దూషించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారింది అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో రైతులు అకాల వర్షంతో నష్టపోతే పరామర్శించిన దాఖలాలు లేవని అన్నారు. రైతులను పట్టించుకున్న పాపాన పోని దౌర్భాగ్య ప్రభుత్వం అని దూషించారు.

ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మండల ప్రభారీ కామని రాజేంద్రప్రసాద్,మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము తిరుపతి,జిల్లా కౌన్సిల్ మెంబర్ వెగోళం శ్రీనివాస్ సీనియర్ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్,మండల ప్రధానకార్యదర్శి కోట నాగేశ్వర్,ఉషన అన్వేష్,గుంటి కుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వడ్లకొండ మహేష్, మెంగాని రామకృష్ణ, పెర్క రమేష్, చిట్టవేని సదయ్య, శేఖర్ మాష్టర్,జెట్టి శ్రీనివాస్, నల్లవేల్లి శంకర్, మనోహర్,సలిగంటి కొమురయ్య, ఎల్లయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు…

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

error: Content is protected !!