రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు కేరళ మోడల్ విద్యార్థి ఎంపిక
సుల్తానాబాద్, అక్టోబర్ 31 (కలం శ్రీ న్యూస్) : రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు మండల కేంద్రంలోని కేరళ మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపికైనట్లు కరస్పాండెంట్ సిజ్జు ఎస్ నాయర్ తెలిపారు.ఇటీవల సెంటినరీ కాలనీలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి పదవ తరగతి విద్యార్థి బొంగూరి అభిషేక్ ఎంపికై, నవంబర్ నాలుగో తేదీ వరకు మహబూబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని కరస్పాండెంట్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్ ఉపాధ్యాయులు కిరణ్ అభినందించారు.

సుంక శ్రీధర్ కలంశ్రీ వార్తలు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు,

