కొండాపూర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఆర్ఐ కరుణాకర్
ఎండపల్లి, ఏప్రిల్ 30 (కలం శ్రీ న్యూస్):ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ కరుణాకర్ మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమ కట్టడాలు కట్టినా, గుట్టల పైన ఉన్న టేకు చెట్లను నరికి అక్రమంగా తరలించినా భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.