పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో లక్కీ డ్రా.
సుల్తానాబాద్, అక్టోబర్ 04(కలం శ్రీ న్యూస్):
దుర్గా నవరాత్రుల్లో సందర్భంగా పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో దుర్గామాత మండపం లో లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రథమ బహుమతి గా శ్రీ శివ సాయి రైస్ మిల్ ఓనర్ కి ఎలక్ట్రిక్ స్కూటీ,రెండవ బహుమతి వాషింగ్ మిషన్ వినయ్ కి,మూడవ బహుమతిగా కోడూరి సతీష్ కి 32 ఇంచెస్ కలర్ టీవీ, వీరు ముగ్గురు లక్కీ డ్రా లో విజేతలుగా నిర్ణయించబడి, వీరికి మున్సిపల్ కమిషనర్ రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం అమ్మవారి చీరలు, నగలు వేలం వేయడం కూడా జరిగింది. తదనంతరం అమ్మవారి ఒడిబియ్యము వండి అన్న ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ వలస నీలయ్య, బీకాం శంకర్, పేగడ కిషన్, వడ్నాల రమేష్, శ్రీరామల శంకర్, గుండేటి రమేష్, దీకొండ భూమేష్, పూసాల సాంబమూర్తి, పెగడ అంజయ్య, ప్రశాంత్, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

