ఘనంగా స్వర్గీయ బిరుదు రాజమల్లు జయంతి వేడుకలు
సుల్తానాబాద్, అక్టోబర్ 01 (కలం శ్రీ న్యూస్):
అందరి ఆత్మబంధువు, బడుగు బలహీన వర్గాల ప్రియతమ నేత పెద్దపల్లి మాజీ శానసభ్యులు స్వర్గీయ బిరుదు రాజమల్లు 75 జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ సుల్తానాబాద్ పట్టణంలోని వారి కాంస్య విగ్రహానికి వారి కుటుంబసభ్యులతో పాటు స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ఈ కార్యక్రమంలో బిరుదు రాజమల్లు కుటుంబ సభ్యులు, జిల్లా గ్రంధాలయం చైర్మన్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, బిరుదు అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

