శ్రీ లక్మినర్సింహా స్వామి జాతరలో 108 సేవలు.
పెద్దపల్లి,నవంబర్20(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్మినర్సింహా స్వామి జాతరలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న కుమారి భక్తులకు సూచించారు. డిఎంహెచ్ఓ ఆదేశానుసారం 108 సౌకర్యం కల్పించామని,భక్తులు 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలని డి.ఎం.హెచ్.ఓ జాతర భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పి.ఓ.ఎం.సి.హెచ్ డాక్టర్ వాణి శ్రీ,108 పెద్దపల్లి జిల్లా కో ఆర్డినేటర్ జంపాల కుమారస్వామి,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కుమార్ స్వామి, పైలట్ నడిగొట్టు సదానందం, ఏ.ఎన్.ఏం లు, ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.