Wednesday, December 4, 2024
Homeతెలంగాణఅయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ

సుల్తానాబాద్,నవంబర్18(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నప్రసాద (భిక్ష) వితరణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. స్థానిక నీరుకుల్ల రోడ్డులో గల శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధిలో అయ్యప్ప స్వాములకు మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ – రాధా దంపతులు వారి కుమారుడు గోకుల్ బిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, అయిల రమేష్ లు మాట్లాడుతూ మండల కేంద్రంలో గల అయ్యప్ప దేవాలయంలో జనవరి మాసం వరకు నిత్య అన్న ప్రసాధం (బిక్ష) కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు అయ్యప్ప స్వాములు భిక్ష ఏర్పాటు చేసేవారు దేవాలయంలో సంప్రదించాలని కోరారు. రానున్న రోజుల్లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తామన్నారు. అనంతరం అయ్యప్ప మాలదారులకు అన్నప్రసాద వితరణ (భిక్ష) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబ్బు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాటేటి శ్రీనివాస్, కోశాధికారి అల్లం సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు మిట్టపల్లి మురళీధర్ గురుస్వామీ, ఉపాధ్యక్షులు టి.కే. ప్రభాకర్, నాగుల కుమారస్వామి, ఆరేపల్లి రత్నం, కమిటీ బాధ్యులు లెక్కల గంగాధర్, సముద్రాల విష్ణు, దుగ్యాల సంతోష్ రావు, టి.కే. తిరుపతి, చేపూరి రవీందర్, గరిగే శ్రీనివాస్, నల్లవెల్లి సతీష్, డాక్టర్ రామిడి శ్రీనివాస్, పిడుగు పోచాలు, ఎల్లే శాంతయ్య, టి.కే.రాజు, వేగోళం శంకర్ గౌడ్, కొయ్యడ చిరంజీవి, చిన్నాల రమేష్, ఆరెపల్లి ప్రవీణ్, రామిడి రవీందర్, తాండ్ర శ్రీధర్, బండారి సూర్యం, వెంకటేష్, గెల్లు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!