శ్రీ శివాలయాన్ని దర్శించుకున్న మంచిర్యాల భక్తబృందం
సుల్తానాబాద్,నవంబర్20(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయాన్ని బుదవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమ సూత్రం, బ్రహ్మ సూత్రం కలిగివున్న ఇక్కడి శివాలయం విశిష్టతను గుర్తించి మంచిర్యాల పట్టణానికి చెందిన అక్షయ ఫౌండేషన్ మహిళలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంథని ఆర్డీవో సురేష్ సతీమణి కే.ఉష తో పాటు భక్తులు ఎం.తిరుమల, టి.స్వప్న, ఎల్.ఉషారాణి, ఎల్.తిరుమల, బి.స్వప్న, కే.వాణి తదితరులు ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకి సత్యనారాయణ,అర్చకులు వల్లకొండ మహేష్, రమేష్, స్థానిక భక్త బృందం నుండి సామల హరికృష్ణ తదితరులు భక్తులకు స్వాగతం పలికారు.