Wednesday, December 4, 2024
Homeతెలంగాణబీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ

బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ

బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ

సుల్తానాబాద్,నవంబర్20(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాష్ర్ట నాయకులు, జిల్లా అధ్యక్షులు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఈ నెల 25 న రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరి కి పెద్దపల్లి జిల్లా నుండి బీసీ నాయకులు , బీసీ మేధావులు,బీసీ యువత,బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీ లా హక్కులకోసం నడుము బిగించాలని పిలుపు ఇచ్చారు. జనగణనలో కులగణన చేయాలని, పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని,బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలని,ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలని, బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలని, రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నందగోపాల్,బీసీ రక్షక దల్ ఛైర్మన్ ఉదయ్ , ఉమ్మడి జిల్లా ఇన్చార్జి శ్రీమాన్ , లత పటేల్,చిగుర్ల శ్రీనివాస్,ఆకుల స్వామి వివేక్ పటేల్, మాజీ ఎంపీటీసీల ఫోరం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుర్రం సంపత్ గౌడ్, బింగ్ రాజు,అవుల వెంకటేష్ యాదవ్, బండారి లక్ష్మన్, బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!