ముదిరి పాకానికి వచ్చిన స్తంభంపల్లి ఇథనాల్ కర్మాగారం అంశం
జగిత్యాల ఎప్రిల్ 2 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో నెలకొల్పే ఇథనాల్ పరిశ్రమ అంశం ఆదివారం నాటికి ముదిరి పాకానికి వచ్చింది. స్తంభంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎలాంటి గ్రామ సభ నిర్వహించకుండా, గ్రామ ప్రజల సలహాలు, సూచనలు, ఫిర్యాదుల తీసుకోకుండా ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేసి గ్రామస్తులకు సహకరించాలని సర్పంచ్ చల్లూరి రూపా రాణిని, అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాగా సర్పంచ్ ను వివరణ కోరగా ఇది సంవత్సరం క్రితం జరిగిన విషయమని దీనిపై ప్రజల అభిప్రాయ సేకరణ కై గ్రామ పంచాయతీ కార్యాలయం వెలుపల నోటీసు అంటించి పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యుల, ప్రజల అభిప్రాయాల అనుగుణంగానే ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి స్తంభంపల్లి గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చినట్లు స్తంభంపల్లి సర్పంచ్ చల్లూరి రూపా రాణి రామచంద్రం గౌడ్ లు వివరణ ఇచ్చారు. కాగా ఏది నిజం, ఏది అబద్దం అనే విషయం నిగ్గు తేలాలంటే తీర్మానం కాపీ చూస్తే కాని చెప్పలేమని విశ్లేషకుల అభిప్రాయం.