Wednesday, December 4, 2024
Homeతెలంగాణవిద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి.

విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి.

విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి.

ఐపీఎస్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్

సుల్తానాబాద్, నవంబర్ 22 (కలం శ్రీ న్యూస్ ): విద్యార్థులు ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు పోటీతత్వం పెంపొందించుకోవాలని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్,ప్రిన్సిపల్ కృష్ణప్రియ అన్నారు.సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఏం సంప్రీత్, ఎస్ నిఖిల్, ఏం వశీకర్,ఈరోజు మెదక్ జిల్లా మాసాయిపేట్ లో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారు. విద్యార్థులను చైర్మన్ సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో రాణించాలని, వివిధ స్థాయి పోటీలలో పాల్గొని విజయాల వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఇష్టమైన క్రీడలను ఎంపిక చేసుకుని దానిలో నైపుణ్యాన్ని పొందాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం వారి పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించి రాణించే ప్రోత్సాహం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, ఇక్బాల్, శివ ,సతీష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!