Wednesday, December 4, 2024
Homeతెలంగాణసామాజిక సేవల్లో ముందున్న వికాస తరంగిణి

సామాజిక సేవల్లో ముందున్న వికాస తరంగిణి

సామాజిక సేవల్లో ముందున్న వికాస తరంగిణి

సుల్తానాబాద్,నవంబర్21(కలం శ్రీ న్యూస్):

వికాస తరంగిణి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సామాజిక, ఆరోగ్య పరిరక్షణ సేవలు నిర్వహిస్తూ సమాజంలో కిలక పాత్ర పోషిస్తుందని సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్ అన్నారు..శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనముల తో సుల్తానాబాద్ వికాస తరంగిణి శాఖ 237 ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన ఔషధ గుళికల మందు పంపిణి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రతినెల పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున స్వర్ణామృత ప్రాసన ఔషధ గుళికల మందు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నదని, జీరో నుండి 16 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు ఇట్టి మందు వినియోగించుకున్నచో వారికి జ్ఞాపకశక్తి, రోగ నిరోధక శక్తి,మేధాశక్తి పెంపొందించబడునన్నారు. మాటలు రాని పిల్లలకు మాటలు వచ్చుటకు తోడ్పడునని, రోగ నిరోధక శక్తి పెంపొందించడం వలన పిల్లలకు తరచుగా వచ్చే సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉందని, ఇట్టి ముందు హైదరాబాదు ముచ్చింతల్ లో ఉన్న జీయర్ ఆయుర్వేదిక్ యునివర్సిటీ ఆసుపత్రి నందు తయారు చేయబడినదని వివరించారు.తమ తమ పిల్లల కోసం వారి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇట్టి సదవకాశాన్ని వినియోగించు కొనగలరని కోరారు. సుల్తానాబాద్ వికాస తరంగిణి శాఖ చీఫ్ కోఆర్డినేటర్ సాదుల సుగుణాకర్ మాట్లాడుతూ స్వర్ణామృత ప్రాసన గుళికలు ప్రతినెల పుష్యమి నక్షత్రం రోజున స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి కోఆర్డినేటర్లు పొదిళ్ల రమేష్ , గొట్టం రమేష్ ,గసిగంటి రవీందర్, ప్రసాద్,జూపాక స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!