Wednesday, December 4, 2024
Homeతెలంగాణఐఏయల్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఐఏయల్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఐఏయల్ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

సుల్తానాబాద్,నవంబర్21(కలం శ్రీ న్యూస్):

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ఈనెల 30న హన్మకొండలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభకు సంబంధించిన పోస్టర్ ను గురువారం సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించారు. “భారత రాజ్యాంగం”, “వృత్తిలో నీతి శాస్త్రం” అనే అంశాలపై ఈనెల 30న, డిసెంబర్ 1న హన్మకొండ లోని హరిత హోటల్ లో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర మహాసభ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్లు మెరుగు సుభాష్, కొత్తపల్లి చిరంజీవి లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఎజిపి దూడం ఆంజనేయులు, న్యాయవాదులు ఆవుల లక్ష్మి రాజం, మేకల తిరుపతిరెడ్డి, ఆవునూరి సత్యనారాయణ, వేపూరి తిరుపతి, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!