రాజారాంపల్లి వార సంత వేలం పాట
జగిత్యాల, ఎప్రిల్ 1 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల, గొర్రెల, మేకల, కూరగాయల, వార సంత సంవత్సరం హక్కుదారుగా సంగ సంజీవ్ ముప్పై ఐదు లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు శనివారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వార సంత వేలం పాటలో దక్కించుకున్నారు. గత సంవత్సరం వేలం పాటలో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక లక్షా ఎనభై ఒక్క వెయ్యి రూపాయల అధిక ఆదాయం రాజారాంపల్లి గ్రామ పంచాయతీ కి వచ్చింది.