Thursday, October 31, 2024
Homeతెలంగాణపారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 

పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 

పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి 

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల మార్చి 25(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లాఎండపెల్లి మండల కేంద్రము లో మాదిగ మహాదండు ఎండపెల్లి మండల అధ్యక్షుడు దొనకొండ శంకర్ అధ్వర్యంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా సంఘం ఆర్గనేజర్ మోకెనపెల్లి బాపన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితులు అధిక జనాభా కలిగిన ఉన్నారని. మాదిగ జాతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరానికి వాడుకుని ఓటరు గా చూస్తున్నారేతప్ప వారికి చేసింది ఏమీ లేదన్నారు.అలాగే  ప్రజాప్రతినిధులు ఇప్పటికీ దళిత బంధు పేరిట వారి చుట్టూ తిప్పుకుంటున్నారని వారికి ఇచ్చింది చాలా తక్కువ అన్నారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులలో 65 శాతం ఉన్న మాదిగలకు ఎన్ని దళిత బంధు యూనిట్లు ఇచ్చారో అందరికీ తెలిసిందే అన్నారు.ఎస్సీలకు అందవలసిన సబ్ ప్లాన్ నిదులు ఏమయ్యాయి అవి ఎక్కడ ఖర్చు చేసారు ఎంత ఖర్చు పెట్టారో తెలుపాలన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు పెండింగ్ పెడుతున్నారని. చివరగా ఎన్నో సంవత్సరం విడుదల చేశారో తెలుపాలని ఆయన ధ్వజమెత్తారు.ఇప్పటికైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో రాబోవు సంవత్సరంలో మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ శాఖ మంత్రి, విద్యా శాఖ మంత్రుల దృష్టికి తీసుకెల్తామన్నారు పారిశుద్ధ్య కార్మికులకు 10 లక్షల ఇన్స్యూరెన్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మరో ఆర్గనైజర్ మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి మాదిగలకు దళిత బంధు ఇవ్వాలన్నారు.మాదిగలకు 100 యునిట్ల లోపు వాడుకునే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని జబ్బలు తెరుచుకున్న ప్రభుత్వం ఇప్పుడు లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాదిగల ఇండ్లలో కి పూర్తిగా ఉచితం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వడ్కాపురం రవి, కుశనపెల్లి దుర్గయ్య, రేగుంట నర్సయ్య, ఎనగందుల గంగయ్య, తాటి నాగరాజు, ఎండపెల్లి మండల అధ్యక్షుడు దొనకొండ శంకర్, వెల్గటూర్ మండల అధ్యక్షుడు చొప్పదండి ప్రసాంత్, ఉపాధ్యక్షులు బరిగెల రాజేశం, మానాల రాజు, ఇంజపూరి రాజు, మోకెనపెల్లి శివ, చెన్న సత్తయ్య, కనుకుట్ల రాజు, కనుకుట్ల కోటి, రఘు, చిన్న అంజి, మల్లేశం, మంతెన లింగస్వామి, దుర్గయ్య, ఆరెల్లి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!