Thursday, September 19, 2024
Homeతెలంగాణకొండాపూరు లో భారాస పార్టీ గ్రామ స్థాయి విస్త్రుత సమావేశం

కొండాపూరు లో భారాస పార్టీ గ్రామ స్థాయి విస్త్రుత సమావేశం

కొండాపూరు లో భారాస పార్టీ గ్రామ స్థాయి విస్త్రుత సమావేశం 

జగిత్యాల ,మార్చి 14 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో భారాస పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం రోజున ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జెండా ఎగురవేసి పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులను ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు వివిధ స్థాయిలో ఉన్న అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు సింహాచలం జగన్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే అహర్నిశలు శ్రమిస్తూ అన్నా అంటే నేనున్నానంటూ ప్రజలతో ఉంటూ ధర్మపురి అభివృద్ధి ప్రధాత కొప్పుల ఈశ్వర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి కార్యకర్త, నాయకుడు కంకణ బద్ధులై పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను గడపగడపకు తీసుకెళ్లి బారాస పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అందరికీ తెలియజేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ మన గ్రామానికి ఇచ్చిన నిధులను పనులను అందరికీ తెలియపరుస్తూ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు క్రమశిక్షణ పాటిస్తూ కలిసిమెలిసి ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రతిపక్షాల నిరాధారా ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఒక సైనికుల పనిచేస్తూ కెసిఆర్ ని మరియు కొప్పుల ఈశ్వర్ ని బలపరచాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు సింహాచలం జగన్. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్ శేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ పదవి నారాయణ రావు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఎండి సలీం, గ్రామ మహిళా అధ్యక్షురాలు చెల్లోజు శారద, మాజీ ఎంపీటీసీ ఇప్పల లక్ష్మి లచ్చయ్య, ఆవుల సత్యం, ఆవుల జయం, గుమ్మడి రాజేశం, దర్శనాల లచ్చయ్య, ఎనగందుల నర్సయ్య, ఇప్పల నాగరాజు, కాసనగట్టు శంకరయ్య, తనుగుల విజయ్, వేనెంకా తిరుపతి, లచ్చయ్య పోచయ్య, గ్రామ మహిళలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!