Tuesday, October 8, 2024
Homeతెలంగాణఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు.

ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు.

ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు.

సుల్తానాబాద్,సెప్టెంబర్17(కలం శ్రీ న్యూస్):

భారతదేశ ప్రధానమంత్రి 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వెలుగు స్వచ్ఛంద సంస్థ,అఖిల గాండ్ల యువజన సంఘం) అధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ లెక్కల నగేష్ మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ నేటి, భావితరాలకు ఆదర్శనీయులుగా నిలుస్తున్న నరేంద్ర మోడీ  జన్మదినోత్సవాన్ని చిన్నారుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పునరావాస కేంద్రంలోని చిన్నారులు నరేంద్ర మోడీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెలుగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ లెక్క నగేష్ అఖిల గాండ్ల తెలుగులో సంఘం నాయకులు పాత్రికేయులు వెన్నంపల్లి శ్రీనివాస్, జక్కం స్వరూప ఆంజనేయులు,యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లం సదాశివ, జి వినయ్,బొల్లం అనిల్, వెన్నంపల్లి శరత్, మురళీకృష్ణ భారతీయ తైలిక్ సాహూ రాథోర్ మహాసభ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!