Tuesday, October 8, 2024
Homeతెలంగాణక్రీడలను ప్రోత్స హించడంలో ముందువరుసలో ఉంటాం 

క్రీడలను ప్రోత్స హించడంలో ముందువరుసలో ఉంటాం 

క్రీడలను ప్రోత్స హించడంలో ముందువరుసలో ఉంటాం 

-సెయింట్ మేరీస్ కరెస్పాండంట్ హెచ్ఏం ఫాదర్ శౌరెడ్డి

సుల్తానాబాద్, సెప్టెంబర్18(కలం శ్రీ న్యూస్): చదువులోనే కాదు,క్రీడల్లో కూడా ఎల్లప్పుడూ సెయింట్ మేరీస్ పాఠశాల ముందు వరుసలో నిలుస్తుందని సెయింట్ మేరీస్ కరెస్పాండంట్ హెచ్ఏం ఫాదర్ కాసు శౌరెడ్డి పేర్కొన్నారు.ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో సెయింట్ మేరీస్ స్కూల్ కి చెందిన విద్యార్థులు మండల జస్వంత్,ఆదిత్యలు లాంగ్ జంప్ లో అత్యుత్తమైన ప్రదర్శన కనబరిచి అండర్ 16 ఇయర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించారన్నారు.వీరు ఈనెల 19,20 తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం జరిగినదని హర్షం వ్యక్తం చేశారు.వీరిని సెయింట్ మేరీస్ స్కూల్ కరెస్పాండంట్, హెచ్ఏం ఫాదర్ కాసు శౌరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు కే ప్రవీణ్,రాకేష్ లు పూల బొకే లు అందించి అభినందించారు.వీరి తోపాటు ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు,నాన్ టీచింగ్ స్టాఫ్,విద్యార్థిని విద్యార్థులు అభినందించి,శుభాకాంక్షలు తెలిపి పాల్గొనబోయే క్రీడలకై బెస్టాఫ్ లక్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!