Tuesday, October 8, 2024
Homeతెలంగాణజాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల

జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల

జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల

సుల్తానాబాద్,సెప్టెంబర్17(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు,కార్యాలయ ఆవరణలో మేనేజర్ అలీమొద్దీన్ జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే సెప్టెంబర్ 17న ప్రజాపాలన పర్యంలోకి తీసుకొని జాతీయ జెండాలను రాష్ట్రవ్యాప్తంగా ఎగరవేసే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, వార్డు కౌన్సిలర్లు పసెడ్ల మమత సంపత్, నిషాద్ రఫీక్, చింతల సునీత రాజు, రెవెల్లి తిరుపతి, దున్నపోతుల రాజయ్య మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!