Thursday, September 19, 2024
Homeతెలంగాణఅనారోగ్యంతో కన్నుమూసిన నాంపెల్లి రాజేశ్వరి

అనారోగ్యంతో కన్నుమూసిన నాంపెల్లి రాజేశ్వరి

అనారోగ్యంతో కన్నుమూసిన నాంపెల్లి రాజేశ్వరి

అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసిన జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్

మంథని ఫిబ్రవరి 22(కలం శ్రీ న్యూస్ ):సింగరేణి ప్రబావిత గ్రామమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామంలోని నిర్వాసితులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన నాంపెల్లి రాజేశ్వరి(కుమ్మరి) అనారోగ్యంతో కన్నుమూశారు. 2009 నుంచి గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం అందించాలని, సరైన న్యాయం చేయాలంటూ అప్పటి ప్రభుత్వం, పాలకులపై పోరాటం చేసింది. పరిహారం చెల్లించకుంటే ప్రాణత్యాగం చేస్తానంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన రాజేశ్వరి పోరాట పటిమను గుర్తించిన అప్పటి ప్రభుత్వం వెంటనే సింగిరెడ్డిపల్లి ఇండ్లకు సంబంధించిన పరిహారం చెల్లించారు.కానీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనంటూ దీక్షబూనిన రాజేశ్వరి గ్రామస్తులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం మళ్లీ పోరాటం మొదలుపెట్టింది.అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తో కలిసి సింగరేణి భవన్‌ ముట్టడిలో కీలకపాత్ర పోషించగా,రాజేశ్వరి పోరాటఫలితంగా ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఇటీవలనే సర్క్యూలర్‌ జారీ చేసింది. కాగా గత రెండు మాసాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి బుధవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ హుటాహుటీన సింగరెడ్డిపల్లికి వెళ్లి ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముందుగా రాజేశ్వరి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని రాజేశ్వరి పాడే మోశారు. అనంతరం రాజేశ్వరి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఆనాడు సింగరేణి నిర్వాసితుల పక్షాన పోరాటం చేసి పరిహారం ఇప్పించిన రాజేశ్వరి పోరాటస్పూర్తిని స్మరించుకుంటూ గ్రామస్తులు కన్నీటి పర్వంతమయ్యారు. ఆమె ఆంత్యక్రియల్లో పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!