నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ టీపీ…. కలెక్టర్ కు వినతి….
జగిత్యాల ఎప్రిల్ 12( కలం శ్రీ న్యూస్): వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు ఆపార్టీ జగిత్యాల జిల్లా ప్రతినిధులు తెలంగాణా రాష్టం లోని నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారికి జరుగుతున్న అన్యాయం పై జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు బుధవారం వినతి పత్రం సమర్పించారు.
నీళ్ల, నిధులు, నియమకాలు కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణా లో అస్సలు నియామకాల ఊసే లేదని నాడు ప్రత్యేక రాష్టం కోసం 1200 యువత తమ ప్రాణాలు తీసుకన్న తర్వాత తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది ఏళ్ల పాలనా లో ఏలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా దారుణం అని అన్నారు, వెంటనే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బిస్వల్ కమిటీ సిఫారసు చేసినా కొలువులు భర్తీ చెయ్యాలని, పీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కుంబకోణం పై సిబిఐ తో విచారణ జర్పించాలని, భారాస పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కు ఇస్తా అన్న 3116 నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, నీళ్లు నిధులు నియామకాలు అన్నా కెసిఆర్ గద్దెన కూర్చొని అన్ని వర్గాలకు మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని, ఇక నైనా ఆలోచించండి ప్రజలారా అని డిమాండ్ పత్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు సమర్పించారు.
ఈ కార్యక్రమం లో వైఎస్సార్ తెలంగాణా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చెదల సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాదే స్రవంతి, జిల్లా ఇంచార్జ్ గంగాధర్, ధర్మపురి కో ఆర్డినేటర్ రాజమ్మ, పార్టీ టౌన్ ప్రెసిడెంటు తదితరులు పాల్గొన్నారు.