హైకోర్టు అదేశాలతో నేడు ఉదయం 10 గంటలకు తెరవనున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్
జగిత్యాల, ఎప్రిల్ 10 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు. అనంతరం అందులోని డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు సమాచారం. అయితే వీ.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేయనుండడం స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
నాటి ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల ఫలితాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ ను తెరిచి అప్పటి ఎన్నికకు సంబంధించిన 17 ఏ,17 సి డాక్యుమెంట్ కాపీలను,సిసి పుటేజి,ఎన్నికల ప్రొసీడింగ్స్ ను ఈనెల 11 సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారి బిక్షపతి ఆదేశించింది.