ఇథనాల్ పరిశ్రమ అంశం రాజకీయం చేయొద్దు : పత్తిపాక
జగిత్యాల ఎప్రిల్ 4 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి లో నెలకొల్పే ఇథనాల్ పరిశ్రమను అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు అడ్డు తగుల వద్దని వెల్గటూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పత్తిపాక వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవర ణలో మండల బీఆర్ఎస్ యువత ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.
స్తంభంపల్లి గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం ప్రాంతం అభివృద్ధికి అవరోధం కలిగించమేనన్నారు. ఉందన్నారు. వెల్గటూరు ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన ఈ ప్రాంత నేత, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంతో కృషి చేసి రూ.750 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు బాట చేస్తే కాంగ్రెస్ నాయకులు అనవసరపు ఆరో పణలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో పలుపురు యువజనులు మాట్లాడుతూ రాజకీయ కక్షతో స్థానిక యువతకు ఉద్యో గాలు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వెల్గటూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కూనమల్ల లక్ష్మి, భారాస పార్టీ వెల్గటూరు మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, యూత్ సంఘం అధ్యక్షుడు బిడారి తిరుపతి, పట్టణ శాఖ అధ్యక్షుడు రంగు తిరుపతి, బోడకుంట రమేష్, కొప్పుల సురేష్, కోఆప్షన్ సభ్యుడు రియాజ్, పెద్దూరి భరత్, కుమ్మరి వెంకటేష్, జగదీశ్వర్, లక్ష్మణ్, రవి, సంకోజు తిరుమలా చారి, సాగర్, సనీ ల్, సింధూజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.