సూరారం లో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమం
జగిత్యాల, ఎప్రిల్ 4 (కలం శ్రీ న్యూస్):జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఫైలేరియా (బోదకాలు) వ్యాధి వ్యాప్తి ని తెలుసుకోవడానికి ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే-3 (TAS-3) కార్యక్రమాన్ని మంగళవారం రోజున వెల్గటూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎండపల్లి మండలం లోని సూరారం గ్రామంలో నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా సూరారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి మరియు రెండవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకి ఫైలేరియా ఆంటీజెన్ పరీక్షలు చేశారు.తొమ్మిది మంది విద్యార్థినీ, విద్యార్థులకు కి పరీక్షలు నిర్వహించగా మొత్తం మందికి నెగటివ్ వచ్చిందని వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన వైద్యురాలు శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్గటూరు వైద్యాధికారి రమేష్, స్థానిక వైద్యాధికారి సి హెచ్ ఓ జగన్నాథం, సి హెచ్ ఓ గట్టు శ్రీధర్, సురేష్ నాయక్ ల్యాబ్ టెక్నీషియన్, సత్యనారాయణ గౌడ్ హెల్త్ అసిస్టెంట్, లక్ష్మి ఏఎన్ఎం మరియు రాజ్యలక్ష్మి ఆశ కార్యకర్త మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.