Friday, October 18, 2024
Homeతెలంగాణప్రతిభ చాటిన కేరళ మోడల్ హైస్కూల్ విద్యార్థులు

ప్రతిభ చాటిన కేరళ మోడల్ హైస్కూల్ విద్యార్థులు

ప్రతిభ చాటిన కేరళ మోడల్ హైస్కూల్ విద్యార్థులు

సుల్తానాబాద్, అక్టోబర్ 6 ( కలం శ్రీ న్యూస్): క్రీడా రంగంలో మండల కేంద్రంలోని కేరళ మోడల్ స్కూల్ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ సిజ్జు ఎస్ నాయర్, వైస్ ప్రిన్సిపాల్ స్మిత ఎస్ నాయర్ లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం ఎన్.టి.పి.సి జ్యోతినగర్ జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల లో ఈ నెల 2న జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్స్ లో కేరళ మోడల్ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరచడంతో అభినందించారు.అలాగే ఈ నెల 7న జరగబోయే తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్ లో విద్యార్థులు ప్రచేతన్,600 మీటర్ల విగ్నేష్, లాంగ్ జంప్,సృజన, లాంగ్ జంప్ గాయత్రి, షార్ట్ పుట్ వైశాలి 60 మీటర్లలో అత్యున్నతమైనా ప్రతిభ ను ప్రదర్శింపజేయాలనీ కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!