అర్హులైన ఫోటోగ్రాఫర్ లకు ప్రభుత్వ పథకాలు అందిస్తాం
సుల్తానాబాద్,అక్టోబర్ 6(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి నియోజకవర్గంలోని ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తానని, అర్హులైన ఫోటోలు వీడియో గ్రాఫర్లు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం నరసయ్యపల్లిలోని విజయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సుల్తానాబాద్ మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఫోటో భవన్ నిర్మాణానికి త్వరలోనే నిధులను అందిస్తానని అన్నారు. నిరుపేద ఫోటోగ్రాఫర్లు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పూసాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శశివర్ధన్, కోశాధికారి మేరుగు హరీష్ లచే ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం సిరి రవి మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్స్ ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. ఫోటో,వీడియోగ్రాఫర్ లకు జిల్లా, రాష్ట్ర అసోసియేషన్ లు అండగా ఉంటుందని అన్నారు.పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఫోటో,వీడియోగ్రాఫర్లు అందరూ కుటుంబ భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఫోటో భవన్ నిర్మాణానికి నిధులు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం అసోసియేషన్ సభ్యులకు ఐడి కార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మహిమాల కేదార్ రెడ్డి, రాజేష్ రెడ్టి,అశోక్,ఉదయ్,ఫోటోఫామ్ అధినేత రేకులపల్లి సుష్మ శశాంక,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి ఇర్ఫాన్, జిల్లా కోశాధికారి అల్లం సతీష్,గౌరవ సలహాదారులు కుర్మ రమేష్ బాబు, గంధం రాజేష్,బీట్ల రమేష్,యెల్ల రాజు,సంపత్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు,సాయిరి మహేందర్, పెద్దన్న,కిషోర్ కుమార్,సతీష్,న్యాయ సలహాదారులు ఆవుల శివక్రిష్ణ, పలు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,కోశాధికారిలతో పాటు అధిక సంఖ్యలో ఫోటో,వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.