గోశాలను సందర్శించిన ఐపిఎస్ విద్యార్థులు.
సుల్తానాబాద్,సెప్టెంబర్14 (కలం శ్రీ న్యూస్):
ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు స్థానిక సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలను సందర్శించారు. విద్యార్థులకు గోవుల యొక్క ప్రాముఖ్యతను అధ్యాపకురాలు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్,ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, మన హిందువుల ఆరాధ్య దైవం గోమాత అని, గోమాతను పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్టేనని అన్నారు. తల్లిపాల వలె, గోవు పాలు సులభంగా జీర్ణం అవ్వడం వల్లనే గోవును గోమాత అని పిలుచుకుంటామని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో గోశాల ఉండడం అదృష్టకరమని, దీనిని అభివృద్ధి పరచుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. విద్యార్థుల వెంట తీసుకొచ్చిన అరటిపండ్లు, పచ్చి గడ్డి ఆవులకు మేతగా వేశారు.ఈ కార్యక్రమంలో ఐపీఎస్ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.