Thursday, November 21, 2024
Homeతెలంగాణరైస్ బ్రౌన్ ఆయిల్ మిల్లును సందర్శించిన ఐపిఎస్ విద్యార్థులు

రైస్ బ్రౌన్ ఆయిల్ మిల్లును సందర్శించిన ఐపిఎస్ విద్యార్థులు

రైస్ బ్రౌన్ ఆయిల్ మిల్లును సందర్శించిన ఐపిఎస్ విద్యార్థులు

సుల్తానాబాద్,సెప్టెంబర్-13(కలం శ్రీ న్యూస్):

రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి ప్రక్రియను సోషల్ సైన్స్ ప్రాజెక్ట్ లో భాగంగా గురువారం ఇండియన్ పబ్లిక్ పాఠశాల ఎనిమిది, తొమ్మిదవ తరగతి విద్యార్థులకు రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి ప్రక్రియ అవగాహన కొరకై శ్రీ లక్ష్మి ఆయిల్ మిల్ సందర్శించి సాంఘిక శాస్త్ర ప్రాజెక్టులో భాగంగా బియ్యం, తవుడు నుండి ఆయిల్ వెలికితీసే ప్రక్రియ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటన వల్ల రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి, స్థానిక ఆర్థిక వ్యవస్థలోని దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్ లలో కల్తీ లేని నూనె దొరకడం లేదని, మనం వాడుతున్న నూనెల వల్లే అనేక రకాల రోగాల బారిన పడుతున్నామని, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల మనకు బి కాంప్లెక్స్ విటమిన్ లభిస్తుందని, ఈ నూనెలో కల్తీ ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!